
సినిమాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచాన్ని, అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు తమ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేసినప్పటికీ, యుద్ధానికి ముగింపు పలికే అధికారిక ఒప్పందం లేదా కాల్పుల విరమణపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.
ఇదే సమయంలో యుద్ధం ముగిసిన వెంటనే ఇంధన ధరలు గణనీయంగా తగ్గుతాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ ఇంధన సరఫరాలు, ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. సరఫరా ఆందోళనలను తగ్గించేందుకు జీ7 దేశాలు అత్యవసర నిల్వల నుంచి చమురు, డీజిల్‌ను విడుదల చేయడానికి అంగీకరించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!