

రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలలో 62,19,648 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,711.79 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు పెన్షన్ల చెల్లింపుల కోసం రూ.3.12 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నెల నిధులతో కలిపి మొత్తం రూ.68,598.44 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల మొదటి తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!