
బిజినెస్

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్–పీ)కు పరిశ్రమల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, పరిశ్రమలు ఆసక్తి చూపకపోవడంతో తక్కువ సంఖ్యలోనే అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
దీంతో పరిశ్రమలు, వాణిజ్య శాఖ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత మంది పరిశ్రమలు పాలసీ కింద దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!