5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి

Writer: Nithish 02:45 PM, 5 నవంబర్, 2026
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ పరిధిలోని కథాల్‌గూడ నుంచి రాజీవ్ గృహకల్ప వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రూ.10 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణ, పటిష్ఠీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణవ్యాప్తంగా రూ.25 వేల కోట్లతో హైమ్స్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మిస్తున్నామని, నల్గొండ జిల్లాలో రూ.2 వేల కోట్లతో డబుల్ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టామని, ధర్వేశిపురం నుంచి కనగల్ వరకు హైమ్స్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

నల్గొండ కార్పొరేషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి చెప్పారు. ఆర్టీసీ డిపోను రాష్ట్ర నిధులతో ఆధునికీకరించామని, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించి 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేసే ఏర్పాట్లను రాబోయే ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు హౌసింగ్ బోర్డు సమీపంలో జీ ప్లస్ త్రీ నమూనాలో 500 ఇళ్లను నిర్మించి అందిస్తామని తెలిపారు. అంతకుముందు భవిత కేంద్రం ఆవరణలో రూ.17.50 కోట్లతో నిర్మించనున్న సమీకృత మండల సముదాయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిల్లీలో మరో భవనం కూలి ఇద్దరు మృతి..

దిల్లీలో మరో భవనం కూలి ఇద్దరు మృతి..

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఇళ్లు, భూముల అటాచ్‌మెంట్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఇళ్లు, భూముల అటాచ్‌మెంట్

రాజస్తాన్‌ ‘మినీ స్విట్జర్లాండ్‌’ అందాల వెనుక దాగి ఉన్న పర్యావరణ విషాదం

రాజస్తాన్‌ ‘మినీ స్విట్జర్లాండ్‌’ అందాల వెనుక దాగి ఉన్న పర్యావరణ విషాదం

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!
ట్యాగ్లు
నల్గొండ అభివృద్ధికోమటిరెడ్డి వెంకట్ రెడ్డినల్గొండ మున్సిపల్ కార్పొరేషన్సూపర్ స్మార్ట్ సిటీతెలంగాణ రోడ్లురోడ్ల విస్తరణడబుల్ రోడ్లునల్గొండ అభివృద్ధి పనులుపేదలకు ఇళ్లుతాగునీటి సరఫరా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు
క్రీడలు

ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు
సినిమాలు

ఐదుగురితో మొదలైన ‘రామాయణ’ ప్రయాణం.. మధ్యలో తప్పుకున్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుడు

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు.. SDRF, NDRF సిబ్బందికి మంత్రి పొంగులేటి ప్రశంసలు
జనరల్

వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు.. SDRF, NDRF సిబ్బందికి మంత్రి పొంగులేటి ప్రశంసలు

అమెరికా యువతికి భారత్‌లో అద్భుత వైద్య అనుభవం.. బెంగళూరు ఆసుపత్రిపై ప్రశంసలు
జనరల్

అమెరికా యువతికి భారత్‌లో అద్భుత వైద్య అనుభవం.. బెంగళూరు ఆసుపత్రిపై ప్రశంసలు

38వ పుట్టినరోజు వేళ తన ఫేవరెట్ ఇన్నింగ్స్‌ చెప్పిన కోహ్లీ
క్రీడలు

38వ పుట్టినరోజు వేళ తన ఫేవరెట్ ఇన్నింగ్స్‌ చెప్పిన కోహ్లీ

రీపోలింగ్‌ డిమాండ్‌ చేయడం చెవిరెడ్డికి అలవాటు: సుధారెడ్డి
రాజకీయాలు

రీపోలింగ్‌ డిమాండ్‌ చేయడం చెవిరెడ్డికి అలవాటు: సుధారెడ్డి

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?
క్రీడలు

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?

దిల్లీలో మరో భవనం కూలి ఇద్దరు మృతి..
జనరల్

దిల్లీలో మరో భవనం కూలి ఇద్దరు మృతి..

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత
జనరల్

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

సొంతూరులో ఓటేసిన దర్శకుడు బోయపాటి శ్రీను
సినిమాలు

సొంతూరులో ఓటేసిన దర్శకుడు బోయపాటి శ్రీను

ఊహించని మలుపులతో ఉత్కంఠ.. జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీ

ఊహించని మలుపులతో ఉత్కంఠ.. జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్

హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ వదులుకోవాలి: అంబటి రాయుడు
క్రీడలు

హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ వదులుకోవాలి: అంబటి రాయుడు