
రాజకీయాలు

అరెస్టు, నిర్బంధానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) కింద ఉన్న నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తిని పోలీసులు వాస్తవంగా నిర్బంధించిన సమయం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని పేర్కొంది. అధికారికంగా అరెస్టు చూపించిన సమయం నుంచి ఈ కాలపరిమితిని లెక్కించకూడదని స్పష్టం చేసింది.
ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత ప్రయాణ సమయాన్ని మినహాయించి, 24 గంటల్లోగా సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ నిబంధనను ఉల్లంఘించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలకు మించి నిర్బంధిస్తే, చట్టప్రకారం తక్షణ విడుదలకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. BNSS సెక్షన్ 58 ప్రకారం నిర్బంధం చట్టబద్ధంగా, సహేతుకమైన పరిమితుల్లో ఉండాలని స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!