
సినిమాలు

తెలంగాణ సచివాలయం మీడియా కేంద్రం సమీపంలో గోడలకు పోస్టర్లు అతికించడంతో కలకలం రేగింది. జగిత్యాల జిల్లాకు చెందిన రమ్య అనే మహిళ ఆదివారం రాత్రి తానే పోస్టర్లు అతికించినట్లు తెలిపింది. ఈ ఘటనతో అక్కడ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఉచిత పథకాల కంటే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం కల్పించాలని పోస్టర్ల ద్వారా రమ్య డిమాండ్ చేసింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని కూడా కోరింది. నిరసన తెలిపిన ఆమెను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని అనంతరం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!