
టెక్నాలజీ

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న శివసాగర్ జిల్లా నేపాలిఖుటి గ్రామాన్ని సందర్శించారు. ఆగస్టు 2న కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అక్కడి విధ్వంసం "ఊహకు అందనిది" అని వ్యాఖ్యానించారు. టెలివిజన్‌లో చూసిన దానికంటే వాస్తవ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు.
వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు, పునరావాసం, గ్రామ పునర్నిర్మాణానికి అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలు సాధారణ జీవనానికి తిరిగి చేరుకునేలా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!