31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి

Writer: Chandrika 08:25 AM, 31 ఆగస్టు, 2026
సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి

వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్రతి ఒక్కరూ సీడ్‌ గణేశుడిని పూజించి ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. సహజ మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే విగ్రహం కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయని తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి చిరంజీవి తన స్వగృహంలో 2026 సీజన్‌ సీడ్‌ గణేశా ప్రతిమలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపు కోసం సంతోష్‌ కుమార్‌ చేస్తున్న కృషిని చిరంజీవి ప్రశంసించారు.

సహజ మట్టి, కోకోపీట్‌, కొబ్బరి పొడితో సీడ్‌ గణేశా ప్రతిమలను తయారు చేస్తున్నారు. వీటి లోపల వేప, చింత వంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతున్నారు. నవరాత్రుల అనంతరం ప్రతిమను కుండలో లేదా పెరట్లోని మట్టిలో ఉంచి నీళ్లు పోస్తే.. ప్రతిమ కరిగి విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాల వల్ల జలవనరులు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్‌ సమయంలో 2020లో ప్రారంభమైన సీడ్‌ గణేశా కార్యక్రమం ద్వారా ఏటా వేలాది ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణహిత వినాయక చవితిపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రకారం ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19.6 కోట్ల చెట్లను నాటేందుకు ప్రోత్సాహం లభించింది. చిరంజీవి మద్దతుతో ఈ వినూత్న ఆలోచన మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..

బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..

విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..

విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..

ట్యాగ్లు
చిరంజీవిసీడ్‌ గణేశాగ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌వినాయక చవితిపర్యావరణహిత గణేశుడుసంతోష్‌ కుమార్‌పర్యావరణ పరిరక్షణగ్రీన్‌ తెలంగాణపర్యావరణహిత పండుగమొక్కల పెంపకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..
జనరల్

బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..

పసుపు, అల్లం, కుంకుమపువ్వు పాలు ఆరోగ్యానికి మంచివంటున్న డాక్టర్లు
ఆరోగ్యం

పసుపు, అల్లం, కుంకుమపువ్వు పాలు ఆరోగ్యానికి మంచివంటున్న డాక్టర్లు

విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..
జనరల్

విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..
జనరల్

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..

“ఈ సినిమా కోసం పెట్టే డబ్బు, సమయం వృథా కాదు”- సందీప్‌ రెడ్డి వంగా
సినిమాలు

“ఈ సినిమా కోసం పెట్టే డబ్బు, సమయం వృథా కాదు”- సందీప్‌ రెడ్డి వంగా

బాలయ్య సినిమాలో తమిళ హీరో?
గాసిప్స్

బాలయ్య సినిమాలో తమిళ హీరో?

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?
గాసిప్స్

సంక్రాంతి లక్ష్యంగా దూసుకుపోతున్న శర్వానంద్?

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు
జనరల్

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

బంగారం ధరలకు బ్రేక్‌..
బిజినెస్

బంగారం ధరలకు బ్రేక్‌..

సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి
జనరల్

సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!