
రాజకీయాలు

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన గన్నవరం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనను గన్నవరానికి తరలించారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 147, 148, 152, 197, 197(1)(డి), 353(1)(బి)తో పాటు 1967 యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 39ను కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!