

జీ మీడియా, వినోద చానెళ్ల వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తన ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులన్నీ కరిగిపోయి ప్రస్తుతం తన వద్ద రూ.6.5 కోట్లు మాత్రమే మిగిలాయని 75 ఏళ్ల సుభాష్ చంద్ర తెలిపారు. తన నివాసంలో కొంత భాగాన్ని అద్దెకిచ్చి, దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రస్తుతం ఖర్చులు నెట్టుకొస్తున్నానని వెల్లడించారు. భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ దీనిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, భవిష్యత్తులో మళ్లీ సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఆలోచనలతో మంచి పనులు ఎలా చేయాలో తనకు తెలుసని, ఆ దిశగా ముందుకు సాగుతానని చెప్పారు.
సుభాష్ చంద్రపై కొనసాగుతున్న వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ (NCLT) ఢిల్లీ బెంచ్ ఇచ్చిన తాజా తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళికలో భాగంగా తన వద్ద మిగిలిన రూ.6.5 కోట్లను కూడా రుణదాతలకు ఇవ్వనున్నట్లు సుభాష్ చంద్ర తెలిపారు. అన్నీ కోల్పోయిన వ్యక్తిలా కాకుండా సాధారణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానని, తన అనుభవం, సామర్థ్యంపై నమ్మకంతో తిరిగి కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!