

నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దాదా’. ఈ సినిమాను పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బాలకృష్ణ, సంగీత దర్శకుడు థమన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై కూడా సంగీతపరంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి బాలయ్య కోసం థమన్ ఎలాంటి మాస్ బీట్స్ సిద్ధం చేశారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ‘దాదా’ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ పాటను దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగుతోంది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!