

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా చుట్టూ ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ చిత్రం కథానాయిక జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న ఆమె.. సినిమాలో తన పాత్రను చూపించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్శకుడు ఇచ్చిన సూచనలను అప్పట్లో గుడ్డిగా అనుసరించకుండా, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు ఇప్పుడు తెలుగు సినీ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తన పాత్ర విషయంలో వచ్చిన విమర్శలకు దర్శకుడిని బాధ్యుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా గతంలో బాలీవుడ్ సినిమాల్లో చేసిన పాత్రలు, సన్నివేశాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పని జాన్వీ.. తెలుగు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఇలా మాట్లాడటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గత చిత్రాలకు సంబంధించిన కొన్ని బోల్డ్ సన్నివేశాల వీడియోలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. అయితే ఆమె వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జాన్వీని సమర్థించే వారు ఉంటే.. మరోవైపు ఆమె తీరును తప్పుబట్టేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!