

విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ తర్వాత మరో భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించినప్పటికీ, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘రణబాలి’పైనే ఉన్నాయి.
‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు విజయ్ స్టార్ ఇమేజ్‌కు తగ్గ స్థాయిలో బజ్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు రాబోయే ట్రైలర్‌పై అందరి దృష్టి నెలకొంది. ట్రైలర్ ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు, ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. రష్మిక కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ‘రణబాలి’ విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో ప్రేక్షకుల స్పందనే నిర్ణయించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!