
క్రీడలు

రెండేళ్ల క్రితం నవంబర్ 25, 2024న ఐపీఎల్ చరిత్రలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. జెడ్డాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడి ఎంపిక అప్పట్లో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శనలతో తన సత్తా చాటాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వివిధ ఫార్మాట్లలో రికార్డులు తిరగరాస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. దీంతో అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ పెట్టిన రూ.1.10 కోట్ల పెట్టుబడి ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యుత్తమ ఎంపికల్లో ఒకటిగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!