

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను జనవరి 13న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముచ్చింతల్‌లో షూటింగ్ జరుగుతోందని, మిగిలిన ఫైట్స్, పాటలు మినహా ఈ నెలాఖరులోగా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు స్క్రీన్‌ప్లే రచయిత కోన వెంకట్ వెల్లడించినట్లు సమాచారం. అనుకున్న సమయానికి సినిమా పూర్తయి సంక్రాంతి బరిలో నిలుస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇక బాబీ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. నాని నిర్మాణంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా ఉంటుందనే ప్రచారం ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో బుచ్చిబాబు సానా, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులు చిరంజీవికి కథలు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కూడా చిరంజీవిని కలిసి కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మెగాస్టార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. చిరంజీవి తన తదుపరి సినిమాకు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!