

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అయితే సినిమా విడుదలై రెండేళ్లకు పైగా గడిచినా ఇప్పటివరకు టెలివిజన్‌లో ప్రసారం కాలేదు. చాలా కాలం పాటు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోకపోవడంతో అభిమానులు టీవీ ప్రీమియర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన మీడియా కథనాల ప్రకారం.. ‘దేవర’ శాటిలైట్ హక్కులను సోనీ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా టెలివిజన్ ప్రసారంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది.
సోనీ తెలుగు ఛానల్ 2027లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఛానల్ ప్రారంభానికి ముందే తన కంటెంట్ లైబ్రరీని బలోపేతం చేసుకునేందుకు పలు సినిమాల శాటిలైట్ హక్కులను కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ‘దేవర’ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంపై చిత్రబృందం లేదా సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!