17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధర్మన్’ షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు

Writer: Harika S 05:34 AM, 17 సెప్టెంబర్, 2026
‘ధర్మన్’ షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మూడో షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు అశ్వత్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ సెట్స్ నుంచి ఒక ఆసక్తికరమైన బిహైండ్-ది-సీన్స్ వీడియో క్లిప్‌ను ఆయన పంచుకున్నారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్, నటి రాశి ఖన్నాతో ముచ్చటిస్తూ కనిపించారు. "ధర్మన్ మూడో షెడ్యూల్ కోసం మళ్లీ తలైవర్‌తో కలిశాను" అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జోడించారు. ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే సెప్టెంబర్ 4న ఈ చిత్ర రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్.. రజనీకాంత్ ఒక సీనియర్ మెడికల్ ఫ్యాకల్టీగా జూనియర్ డాక్టర్లకు పాఠాలు చెబుతున్న సన్నివేశాలతో కూడిన వీడియోను విడుదల చేసింది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్ నిర్మాణంలో రజనీ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ధర్మమే గెలుస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక వైద్యుడి పాత్రలో నటిస్తూనే, సమాజంలోని నేరస్థులను శిక్షించే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో విడుదలైన టైటిల్ పోస్టర్‌లో ఆపరేషన్ థియేటర్‌లో స్కాల్‌పెల్ చేతిలో పట్టుకుని, ఒక రౌడీ మృతదేహంపై కాలు వేసి ఉన్న రజనీకాంత్ లుక్ సినిమాపై ఉత్కంఠను మరింత పెంచింది. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ ద్వయం స్టంట్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుస షెడ్యూళ్లతో సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

ట్యాగ్లు
రజినీకాంత్ధర్మన్ధర్మన్ సినిమాఅశ్వత్ మారిముత్తుఅనిరుద్కమల్ హాసన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!