

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజాగా సంగీతానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ‘ధురంధర్’ చిత్రానికి తన సంగీతంతో గుర్తింపు తెచ్చుకున్న శశ్వత్ సింగ్ సచ్‌దేవ్ కూడా ‘డ్రాగన్’ కోసం పనిచేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే సినిమాకు సంబంధించిన సంగీతంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరగనుంది. అయితే శశ్వత్ సింగ్ సచ్‌దేవ్ భాగస్వామ్యంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!