1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

Writer: Chandrika 07:01 PM, 1 నవంబర్, 2026
ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

2024లో లెబనాన్‌లో హెజ్‌బొల్లా సభ్యుల పేజర్లను పేల్చిన ఘటన తరహాలోనే ఇరాన్‌పై కూడా రహస్య ఆపరేషన్లు చేపట్టేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొసాద్ మాజీ గ్లోబల్ ఆపరేషన్స్ డిప్యూటీ హెడ్ ఒడెడ్ ఐలామ్‌ను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే.. అక్కడి కీలక నేతలు ఉపయోగించే పేజర్లు, బీపర్లు, వాకీటాకీల వంటి కమ్యూనికేషన్ పరికరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని సమాచారం. ఇలాంటి పేలుడు పదార్థాలు అమర్చిన పరికరాలను ఇప్పటికే ఇరాన్‌కు చేరవేసి ఉండవచ్చని కూడా కథనాలు పేర్కొంటున్నాయి. సంప్రదాయ భూతల దాడుల కంటే ఇటువంటి రహస్య ఆపరేషన్లు మరింత తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలో ఇరాన్ అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లలో పేలుడు పదార్థాలు అమర్చారని, 2020లో నతాంజ్ అణు కేంద్రంలో జరిగిన పేలుడుకు అవే కారణమని మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావెద్ జారిఫ్ ఆరోపించినట్లు కథనాలు గుర్తుచేస్తున్నాయి.

ఇజ్రాయెల్ టార్గెట్‌లో నలుగురు కీలక వ్యక్తులు?

ఇరాన్‌లో అధ్యక్షుడు పెజెష్కియన్, సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబఫ్‌ల వెనుక అసలు నిర్ణయాధికారులు మరికొందరే ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆ జాబితాలో ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిది, బసిజ్ దళాల కమాండర్ హుస్సేన్ తాయెబ్, ఇరాన్ సైన్యాధిపతి అలీ అబ్దుల్లాహి, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయి ఉన్నట్లు సమాచారం. జనవరిలో జరిగిన నిరసనల అణచివేతలో, అలాగే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలను అడ్డుకోవడంలో వీరి పాత్ర ఉందని కథనాలు ఆరోపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ప్రకటన తర్వాత కూడా దాన్ని మూసివేయడంలో ఐఆర్‌జీసీ పాత్ర ఉందని పేర్కొంటున్నాయి. ఈ నలుగురిని లక్ష్యంగా చేసుకుని రహస్య ఆపరేషన్లు చేపట్టాలని ఇజ్రాయెల్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ ప్రణాళికలపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది -  కాంగ్రెస్‌ నేతలు

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది - కాంగ్రెస్‌ నేతలు

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

ట్యాగ్లు
ఇజ్రాయెల్ఇరాన్మొసాద్రహస్య ఆపరేషన్ఆపరేషన్ గ్రిమ్ బీపర్హెజ్‌బొల్లాఅహ్మద్ వాహిదిమొహ్సెన్ రెజాయిహర్మూజ్ జలసంధిమధ్యప్రాచ్య ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
జనరల్

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే
జనరల్

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!