

అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. అయితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున మరో 48 గంటల పాటు ఆమెను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని నారా లోకేశ్ స్పష్టం చేశారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నారుల రక్షణ కోసం పటిష్ఠమైన వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, బాలికను తన సొంత కూతురిలా చూసుకునే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!