

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ జోరు కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.366 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రూ.342 కోట్ల గ్రాస్ అందుకున్న ‘టాక్సిక్’ను ‘హనుమాన్ అంశ్’ అధిగమించింది. భారీ చిత్రాల మధ్య విడుదలైనప్పటికీ అంచనాలను మించి స్పందన అందుకుంటోంది. విడుదలైన 47వ రోజున కూడా ఈ సినిమా రూ.4.90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా రూ.366 కోట్ల మార్క్‌ను చేరుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విడుదలై చాలా రోజులు గడిచిన తర్వాత సినిమాల వసూళ్లు తగ్గుతుంటాయి. అయితే ‘హనుమాన్ అంశ్’కు ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ‘టాక్సిక్’ వసూళ్లను అధిగమించడం ద్వారా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో వసూళ్ల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!