

‘వారణాసి’ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని భారీ చిత్రాలను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోకి తీసుకురావడంపై ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు దర్శకులతో ఐమ్యాక్స్ ధృవీకరించిన కెమెరాలతో చిత్రీకరణ జరిపే అంశంపై సంస్థ ప్రతినిధులు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘గాడ్ ఆఫ్ వార్’, ‘ఏఏ23’, ‘ఆర్‌సీ17’, ‘కల్కి 2’ చిత్రాలు ఐమ్యాక్స్ కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్, విస్తృతమైన విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాలకు ఐమ్యాక్స్ సాంకేతికతను ఉపయోగిస్తే ప్రేక్షకులకు మరింత విస్తృతమైన సినిమాటిక్ అనుభూతి అందే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల్లో ఏది అధికారికంగా ఐమ్యాక్స్ ధృవీకరించిన కెమెరాలతో చిత్రీకరించనుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దర్శకులు, నిర్మాణ సంస్థలతో ఐమ్యాక్స్ బృందం జరుపుతున్న చర్చల అనంతరం అధికారిక ప్రకటనలు వెలువడితే తుది వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!