

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ‘జైలర్ 2’కు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసిందని, అయితే రజనీకాంత్ మాత్రం ‘యూఏ’ సర్టిఫికెట్ రావాలని కోరుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
‘యూఏ’ సర్టిఫికెట్ వస్తేనే సినిమాను విడుదల చేయాలని, లేకపోతే విడుదల చేయకూడదని రజనీకాంత్ చిత్రబృందానికి సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు రజనీకాంత్ లేదా చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వార్తలను అభిమానులు అధికారిక ధ్రువీకరణ లేని ప్రచారంగా కొట్టిపడేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!