

నటుడు సూర్య క్రైమ్ థ్రిల్లర్ ‘సీన్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళంలో ‘ఆవేశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదల కానుంది. ఇందులో నస్లెన్ సైకోపాత్ కిల్లర్ పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటి నజ్రియా ఫహద్ కథానాయికగా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జితు మాధవన్ ఈ సినిమాలో మొత్తం 13 పాటలు ఉన్నాయని వెల్లడించారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో ఇన్ని పాటలు ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని పాటల్లో కథకు సంబంధించిన కీలక స్పాయిలర్లు ఉన్నాయని, అందుకే వాటి విజువల్స్‌ను బయటపెట్టడం లేదని దర్శకుడు తెలిపారు.
ప్రతినాయకుడి పాత్ర కోసం నస్లెన్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని కూడా జితు మాధవన్ వివరించారు. నేరాలు చేస్తున్నప్పటికీ అమాయకంగా కనిపించే కొత్త ముఖం కావాలని భావించడంతో నస్లెన్‌ను ఎంపిక చేసినట్లు చెప్పారు. సూర్య, జితు మాధవన్, ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌లో 13 పాటలు ఉండటం, వాటిలో కథకు సంబంధించిన కీలక అంశాలు దాగి ఉండటం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!