

జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కిల్లర్’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్వాజ్ మరో కీలక పాత్రలో నటించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి, ఎ. పద్మనాభరెడ్డితో కలిసి నిర్మించారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూర్వాజ్ మాట్లాడుతూ, ‘కిల్లర్’ ఒక మహిళా ప్రాధాన్య చిత్రమని తెలిపారు. ఇందులో జ్యోతి టెర్రరిస్ట్, వ్యాంపైర్, స్పై వంటి విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, తాను సైంటిస్ట్‌గా, పోలీస్ అధికారిగా నటించానని చెప్పారు.
న్యూరో లింక్ సాంకేతికతను మనుషులపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన ఆలోచన ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించినట్లు పూర్వాజ్ వెల్లడించారు. సినిమా ద్వితీయార్థంలోని కీలకమైన ట్విస్ట్‌ను ముందుగా సరిగ్గా అంచనా వేసి చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు సినిమా ప్రీమియర్లు ప్రారంభమవుతాయని, రాత్రి 11 గంటలకు ట్విస్ట్‌కు సంబంధించిన సమాధానాన్ని వాట్సాప్ ద్వారా పంపాలని తెలిపారు. సరైన సమాధానాన్ని ముందుగా పంపిన విజేత పేరును సినిమా సక్సెస్ మీట్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తామని చెప్పారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!