
రాజకీయాలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ రిలీజ్ డేట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీపై చర్చ మొదలైంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుంది. మరోవైపు చిరంజీవి ‘విశ్వంభర’ కూడా అక్టోబర్ 16న వస్తుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, ఆ తేదీకి సినిమా విడుదల కాదనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘రణబాలి’ అదే తేదీని ఖరారు చేసుకోవడంతో అక్టోబర్ బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!