

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘కాకా’ గ్లింప్స్‌తో పాటు ఆ సినిమాను 2027 జనవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో మంచి ట్రీట్ లభించింది. అయితే ఇదే సమయంలో ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది.
వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తర్వాత సినిమా రిలీజ్‌పై అనేక రూమర్లు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా తేదీని ప్రకటించలేదు. 2026 అక్టోబర్ 16న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ, తాజాగా వచ్చిన ప్రచార అప్‌డేట్‌లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!