
జనరల్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల నైజాం రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, వాటిని చిత్ర బృందం అధికారికంగా ఖండించింది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ నైజాం రైట్స్ కోసం భారీ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై మేకర్స్ కూడా సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!