

నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. సినిమా కాన్సెప్ట్‌ను కొందరు ప్రేక్షకులు ప్రశంసించగా, మరికొందరు కొన్ని లోపాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, డిజిటల్ ప్రేక్షకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు నాని స్వయంగా రీ-ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఓటీటీ వెర్షన్‌లో స్క్రీన్‌ప్లేను మరింత ఆసక్తికరంగా మార్చడంతో పాటు థియేట్రికల్ వెర్షన్‌లో లేని అదనపు కంటెంట్‌ను జోడించనున్నట్లు తెలుస్తోంది. రన్‌టైమ్ కారణంగా థియేటర్లలో తొలగించిన ఒక పూర్తి పాటను డిజిటల్ వెర్షన్‌లో తిరిగి చేర్చే అవకాశం ఉందని, పాటలకు సంబంధించిన కొన్ని భావోద్వేగ సన్నివేశాలను కూడా జోడించవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ మార్పులపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ తేదీ, తుది వెర్షన్‌లో ఉండే మార్పులపై స్పష్టత రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!