8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

Writer: Chandrika 09:35 AM, 8 ఆగస్టు, 2026
గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి కథల స్ఫూర్తితో రూపొందనున్న ఈ చిత్రాన్ని పౌరాణిక అంశాలతో కూడిన యాక్షన్ ఎపిక్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ అత్యంత శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

2027 మార్చి తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించి, అదే సంవత్సరం ద్వితీయార్థంలో చిత్రీకరణ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ‘డ్రాగన్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఆ సినిమా పూర్తయిన అనంతరం మాత్రమే ‘గాడ్ ఆఫ్ వార్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

చరణ్ కొత్త జోడీగా రుక్మిణి వసంత్?

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మ్యాన్

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

బన్నీ ప్రాజెక్టులు.. ఆ రూమర్లకు బ్రేక్?

ట్యాగ్లు
ఎన్టీఆర్‌జూనియర్‌ ఎన్టీఆర్‌త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గాడ్‌ ఆఫ్‌ వార్‌ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాతెలుగు సినిమాటాలీవుడ్‌అరవింద సమేతడ్రాగన్‌ సినిమారాబోయే తెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!
సినిమాలు

ఆకట్టుకుంటున్న విశ్వనాధ్ అండ్ సన్స్ ట్రైలర్!

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?
గాసిప్స్

భాగ్యశ్రీకి మరో క్రేజీ ఆఫర్?

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!
సినిమాలు

ఓజి: బుల్లితెరపై సందడికి సిద్ధం!

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ టీజర్‌కి మళ్లీ పాజిటివ్ వైబ్స్!

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?
సినిమాలు

జాన్వీ - శ్రీలీల: వరుస అవకాశాలు.. కానీ గుర్తింపు కరువు?

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...
సినిమాలు

రెండు రోజుల్లో రెండు సినిమాలతో నయన్ సందడి...

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?
గాసిప్స్

సల్మాన్ - వంశీ పైడిపల్లి చిత్రంలో జాకీ ష్రాఫ్?

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!
సినిమాలు

కొరియన్ కనకరాజు దూకుడు.. విదేశాల్లోనూ అదుర్స్!

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?
గాసిప్స్

గాడ్ ఆఫ్ వార్‌కు మరింత ఆలస్యం తప్పదా?

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..
జనరల్

ప్రైవేటు పాఠశాలలకు కీలక ఆదేశాలు..

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు
జనరల్

నిశ్చితార్థం రద్దుతో వివాదం.. మాజీ ప్రియుడికి వరుస బెదిరింపులు

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..
జనరల్

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!