
రాజకీయాలు

కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా రూ.4,500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించినట్లు సమాచారం. తన క్రష్ మనసు గెలుచుకునేందుకు ఓ యువకుడు రహస్యమైన మర్రి కొమ్మను విరగ్గొట్టడం, ఆ తర్వాత అతడికి ఎదురయ్యే సైకలాజికల్ భయానక పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. విభిన్నమైన కథాంశం, భయానక అంశాలతో ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
‘అబ్సెషన్’ సినిమా 2025 సెప్టెంబర్‌లో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అనంతరం 2026 మే 15న థియేటర్లలో విడుదలైంది. విడుదల తర్వాత ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినట్లు సమాచారం. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు రావడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!