

ప్రధాని నరేంద్ర మోదీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాసినట్లు సమాచారం. 25 ఏళ్ల ప్రజాసేవ, దేశం పట్ల అంకితభావం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ఠను పెంచడంలో మోదీ పోషించిన పాత్రను గుర్తించి ఈ గౌరవం ఇవ్వాలని సాహ్నీ తన లేఖలో పేర్కొన్నారు.
నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన ఓ ప్రదర్శనకు వచ్చిన 2,500 మందికి పైగా జెన్‌జీ సందర్శకులు కూడా మోదీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారని సాహ్నీ పేర్కొన్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది మాజీ ప్రధానులకు భారతరత్న లభించిందని గుర్తుచేస్తూ, మోదీ కూడా ఈ పురస్కారానికి అర్హులైన వారిలో ఒకరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్‌తో రాజకీయ నాయకుల సేవలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం అందించే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!