
క్రీడలు

అస్తానాలో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ మనీషా బన్వాలా చరిత్ర సృష్టించింది. మహిళల 59 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగల్ ఎలిజబెత్‌ను 8-6 తేడాతో ఓడించింది. ఈ విజయంతో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మనీషా రికార్డు నెలకొల్పింది.
భారత రెజ్లింగ్ చరిత్రలోనూ మనీషా విజయం ప్రత్యేక గుర్తింపు పొందింది. 2010లో సుశీల్ కుమార్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా ఆమె నిలిచింది. ఇప్పటివరకు ఈ పోటీల్లో నలుగురు భారత మహిళలు మాత్రమే ఫైనల్‌కు చేరుకున్నారు. 2021లో అన్షు మాలిక్ తొలిసారిగా ఫైనల్‌కు చేరగా, ప్రస్తుత టోర్నీలో నీలమ్ (50 కేజీలు), కాజల్ (76 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!