

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తన ఖాతాదారుల కోసం ప్రత్యేక వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం ఫోన్ కాల్స్, SMSల కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి. డేటాను ఎక్కువగా వినియోగించని సాధారణ ఫోన్ వినియోగదారులు, సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి ప్లాన్లను అందిస్తుండగా, ఇప్పుడు Vi సైతం అదే తరహా సేవలను ప్రారంభించింది.
ఈ ప్లాన్లలో రూ.179 రీఛార్జ్‌పై 25 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది. రూ.185 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అపరిమిత కాలింగ్, 300 SMSలు అందుబాటులో ఉంటాయి. రూ.203 ప్లాన్‌లో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, 300 SMSలు లభిస్తాయి. ఇక రూ.206 ప్లాన్‌తో ఒక నెల పాటు అపరిమిత కాలింగ్, 300 SMSల ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ల లభ్యత టెలికాం సర్కిల్‌ను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి రీఛార్జ్ చేసుకునే ముందు Vi అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివరాలు, నిబంధనలు పరిశీలించడం మంచిది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!