
రాజకీయాలు

భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ తనయులు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. దిగ్గజ క్రికెటర్ల వారసులు ఒకే జట్టులో ఎంపిక కావడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
నవంబర్ 5 నుంచి 14 వరకు ఒమన్ రాజధాని మస్కట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అన్వయ్, ఆర్యవీర్ ఇద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శన ఆధారంగా జాతీయ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా కప్‌లో తమ ప్రతిభను నిరూపించుకుని భారత జట్టు విజయాల్లో భాగస్వాములు కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!