
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దీపావళి కానుక ప్రకటించాయి. కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. నవంబర్ 5వ తేదీన బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250 వరకు బోనస్ అందనుంది.
ఈ బోనస్ చెల్లింపుల కోసం సింగరేణి యాజమాన్యం మొత్తం రూ.419 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో సుమారు 38 వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. నవంబర్ 5న బోనస్ మొత్తాన్ని అర్హులైన కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో దీపావళి పండుగ వేళ సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం నెలకొననుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!