

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటనకు గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య కారణాలు, పెరుగుతున్న రాజకీయ బాధ్యతల దృష్ట్యా సినిమాలు మరియు రాజకీయాలను ఒకేసారి కొనసాగించడం కష్టంగా మారుతోందని ప్రచారం జరుగుతోంది. కొత్త సినిమా ప్రాజెక్టులను అంగీకరించకుండా పూర్తిగా ప్రజాసేవపై దృష్టి పెట్టాలని ఆయనకు సన్నిహితులు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే నిర్మాత రామ్ తాళ్లూరి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు మరికొన్ని చిత్రాలకు పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమవుతారా లేదా నటనను కొనసాగిస్తారా అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!