
జనరల్

ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లవి’ పాట థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకుని, సినిమా విజయానికి కీలకంగా నిలిచిందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అలాంటి మరో భక్తి గీతాన్ని కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న సినిమాలో చేర్చినట్లు సమాచారం. ఈ పాట హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుని, సినిమాలో కీలకమైన సిట్యువేషన్‌లో ఉపయోగించినట్లు తెలుస్తోంది.
‘రఘుకుల తిలక’ అంటూ సాగే ఈ భక్తి గీతం గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో, దేవుడికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో మంచి ఆదరణ పొందినట్లు సమాచారం. ఇప్పటికే ప్రజల్లో పాపులర్ అయిన ఈ పాటను థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని, ముఖ్యంగా సినిమాలోని ఆ సిట్యువేషన్‌లో పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!