

మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమాపై సీక్వెల్ చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెన్స్‌పై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో రెండో భాగంలో చరణ్ కీలక పాత్రలో కనిపిస్తారా అనే ప్రశ్న దర్శకుడికి ఎదురైంది. దీనిపై శివ నిర్వాణ స్పందిస్తూ, ‘ఇరుముడి’ కథ సహజంగా పుట్టిన ఆలోచన అని, ప్రస్తుతం సీక్వెల్ చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
సీక్వెల్ చేయాలంటే కథ సహజంగా కొనసాగేందుకు అవకాశం ఉండాలని, కేవలం సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొనసాగించడం సరైన విధానం కాదని శివ నిర్వాణ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ‘ఇరుముడి’ రెండో భాగంలో రామ్ చరణ్ కనిపిస్తారనే ప్రచారానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టైంది. భవిష్యత్తులో కథ సహజంగా కొనసాగించే అవకాశం వస్తే పరిస్థితి మారవచ్చని తెలుస్తున్నా, ప్రస్తుతం మాత్రం సీక్వెల్‌పై ఎలాంటి ప్రణాళిక లేదని దర్శకుడు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!