

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం గతంలోనే జరిగింది. తాజాగా ఈ పాత్రలకు సంబంధించి మరో ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పోషించే మూడు పాత్రలు డోపెల్‌గ్యాంగర్‌లుగా ఉంటాయని, రూపంలో ఒకేలా కనిపించినా వారి మధ్య ఎలాంటి రక్త సంబంధం ఉండదని ప్రచారం జరుగుతోంది.
‘రాకా’ కథ, పాత్రలకు సంబంధించిన కీలక విషయాలను చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. దీంతో అల్లు అర్జున్ పాత్రలపై వస్తున్న ప్రతి వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మూడు పాత్రలు ఉంటాయనే ప్రచారానికి తోడు అవి డోపెల్‌గ్యాంగర్ పాత్రలనే వార్త సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అల్లు అర్జున్ నిజంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారా, వాటి మధ్య సంబంధం ఏమిటనేది చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!