

ఆర్య కథానాయకుడిగా, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్పట్ట పరంబరై ప్రీక్వెల్ చిత్రీకరణ సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఆర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ది ఆరిజిన్ ఆఫ్ సర్పట్ట పరంబరై బిగిన్స్ అంటూ బాక్సింగ్ రింగ్‌ను చూపించే పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. మొదటి భాగానికి ముందు జరిగిన కథను ఈ ప్రీక్వెల్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్పట్ట పరంబరై ప్రపంచాన్ని మరింత విస్తరించేలా ఈ కథ ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
2021లో కరోనా లాక్‌డౌన్ సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన సర్పట్ట పరంబరై ఉత్తర చెన్నై బాక్సింగ్ సంస్కృతి, రెండు బాక్సింగ్ వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో సాగింది. ఇందులో కబిలన్‌గా ఆర్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే పాత్రలో మరోసారి ఈ ఫ్రాంఛైజీలోకి ఆయన తిరిగి వస్తున్నారు. ప్రీక్వెల్ కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!