
గాసిప్స్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నటిస్తున్న 23వ చిత్రానికి అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తం సౌత్ ఇండస్ట్రీలోని పలువురు టైర్-2 హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో అనిరుధ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మ్యూజిక్ ఉన్న సినిమాలకు రిలీజ్‌కు ముందే భారీ హైప్ రావడం కూడా కలిసొస్తోంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోనూ అనిరుధ్‌కు పెరుగుతున్న క్రేజ్ కారణంగా ఆయన కోసం నిర్మాతలు భారీ మొత్తాలను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!