
షోస్

జార్ఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర పర్యాటక, ఉన్నత సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గిరిడీహ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2019లో తొలిసారి గెలుపొందారు. 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగారు.
సుదివ్య కుమార్ సోను ఆకస్మిక మరణంతో జేఎంఎం శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సీనియర్ నేతను కోల్పోవడం పూడ్చలేని లోటని నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!