

విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (IGZP)కు జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా 12 కొత్త వన్యప్రాణులు చేరాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన ట్రస్ట్‌తో జరిగిన జంతు మార్పిడి కార్యక్రమం పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలిసారిగా విశాఖ జూలో కాటన్‌టాప్ టామరిన్లు సందడి చేయనున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జంతు మార్పిడి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ బృందాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. కొత్త వన్యప్రాణుల రాకతో జూలో జంతు వైవిధ్యం మరింత పెరగడంతో పాటు సందర్శకులకు అరుదైన జాతులను చూసే అవకాశం లభించనుంది. వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేయడంతో పాటు జూ సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!