

దేశంలో చాలా మంది పైల్స్ సమస్యతో మౌనంగా బాధపడుతున్నారు. ఈ సమస్యను చెప్పుకోవడానికే సంకోచిస్తూ, ఆసుపత్రులు తిరిగినా సరైన ఫలితం దక్కక ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇంట్లో సులభంగా తయారుచేసుకునే ఒక పానీయం ఈ సమస్యను కొంతవరకు తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం, కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కలిపి తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ అందుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పసుపులోని కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. నిమ్మరసం విటమిన్ C అందించి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పైల్స్ ఉన్నవారు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, మలబద్ధకం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ పానీయం తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!