
బిజినెస్

దంచికొట్టే వానల్లో వేడి వేడి స్నాక్స్ తినడం ఒక ప్రత్యేక అనుభూతి. అందులో పెసరపప్పు వడలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. పల్లీల చట్నీ లేదా చికెన్ గ్రేవీతో కలిపి తింటే ఇవి మరింత రుచిగా ఉంటాయి. కరకరలాడే టెక్స్చర్, మసాలా రుచి వల్ల వీటిని ఎక్కువగా తినాలనిపిస్తుంది. పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వంటి పదార్థాలతో ఇవి సులభంగా తయారు చేయవచ్చు.
ఈ వడలను తయారు చేయాలంటే ముందుగా ఒక కప్పు పెసరపప్పును కనీసం మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి పచ్చిమిర్చి, అల్లంతో కలిపి కొద్దిగా ముద్దగా గ్రైండ్ చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. గిన్నెలో నూనె వేడి చేసి, చేతికి ఆయిల్ రాసుకుని వడలుగా ఒత్తి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేడి వేడి వడలు సిద్ధం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!