

ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన ఈ రోజుల్లో చాలామంది తెల్ల చక్కెరకు బదులుగా ఖర్జూరాలు, బెల్లం వంటి సహజ తీపి పదార్థాలను ఎంచుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి వీటిలో ఏది మంచిదనే సందేహం ఉంటుంది. నిపుణుల ప్రకారం ఖర్జూరాల్లో ఉండే ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. తక్కువ నుంచి మధ్యస్థ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు తోడ్పడతాయి.
బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నప్పటికీ, ఇందులో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. బరువు తగ్గే లక్ష్యంతో ఉన్నవారు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 1 నుంచి 2 ఖర్జూరాలు తీసుకోవచ్చని, బెల్లాన్ని మాత్రం తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహార మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!