

ప్రస్తుతం బరువు పెరగడం, ఊబకాయం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. దీంతో ఫిట్‌గా ఉండేందుకు కొందరు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా, మరికొందరు యోగా, నడక వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి యోగా, జిమ్‌లో ఏది ఎక్కువ ప్రయోజనకరమనే సందేహం ఉంటుంది. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కండరాల సౌలభ్యం, శరీర సమతుల్యత పెరుగుతాయి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా యోగా సాధన చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
మరోవైపు, బరువు తగ్గడంతో పాటు కండరాల బలాన్ని పెంచుకోవాలనుకునే వారికి జిమ్ వ్యాయామాలు ఉపయోగకరంగా ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్, ట్రెడ్‌మిల్, సైక్లింగ్, కార్డియో వ్యాయామాలు కేలరీలను ఖర్చు చేయడంలో సహాయపడతాయి. సాధారణంగా తీవ్రమైన కార్డియో వ్యాయామాలు నెమ్మదైన యోగా కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. అయితే బరువు తగ్గడంలో వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారం, సరైన నిద్ర కూడా కీలకమే. యోగా, జిమ్ రెండింటినీ కలిపి సాధన చేయడం ద్వారా కండరాల బలం, శరీర సౌలభ్యం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు. వ్యక్తి వయస్సు, శారీరక సామర్థ్యం, ఆరోగ్య పరిస్థితులను బట్టి వ్యాయామ విధానాన్ని ఎంచుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!