

వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’పై తాజా అప్‌డేట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందిన ప్రీతి పగడాల హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మద్దతుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కీర్తన్ నాగగౌడ కథ, దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ముందుగా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడిందని వార్తలు ప్రచారం అయ్యాయి.
ఈ ప్రచారాలపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్, ప్రత్యేక ప్రకటన ద్వారా అసలు విషయాన్ని వెల్లడించారు. జూలై 31న సినిమా విడుదల కావడం లేదని స్పష్టం చేస్తూ, అభిమానులు చూపుతున్న సహనం, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ప్రేక్షకులకు మరింత భయానక అనుభూతి అందించేలా సినిమా సిద్ధం అవుతోందని పేర్కొంటూ, ఈ నిరీక్షణకు తగిన ఫలితం అందిస్తామని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!