

వెంకటేశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి కథానాయికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా తగ్గింది. దీంతో విడుదల రోజున ఉదయం షోలకు డల్ రెస్పాన్స్ కనిపించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా పుంజుకుంది.
గత 24 గంటల్లో ఈ సినిమా ఏకంగా 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇది టికెట్ విక్రయాల్లో గణనీయమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి కూడా సినిమా పట్ల మంచి స్పందన వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారాంతంలో ‘ఆదర్శ కుటుంబం’ మరింత బలమైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజా ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకునే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, చినబాబు నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!